NTV Telugu Site icon

Hyderabad: నాన్‌వెజ్ ప్రియులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వ మటన్ క్యాంటీన్

Mutten Biryani In Hyderabad

Mutten Biryani In Hyderabad

Hyderabad: నాన్ వెజ్ ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తక్కువ ధరలకు నాణ్యమైన మటన్ బిర్యానీ, ఇతర మాంసాహార వంటకాలను అందించడానికి సిద్ధం చేన్నట్లు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ గొర్రెలు, మేకల అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఈ వంటకాలను వడ్డించనున్నారు. హైదరాబాద్‌లోని మాసాబ్‌ట్యాంక్‌ సమీపంలోని శాంతినగర్‌లో ఈ నెల 12న ‘తెలంగాణ మటన్‌ క్యాంటీన్‌’ ప్రారంభం కానుంది. ఇప్పటికే శాంతినగర్‌లో ప్రారంభించిన చేపల క్యాంటీన్‌కు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. దీంతో గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య మటన్ క్యాంటీన్ పై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ల అనుమతితో క్యాంటీన్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఫెడరేషన్ కేంద్ర కార్యాలయం సమీపంలో క్యాంటీన్‌ను నిర్మించారు. ముందుగా హైదరాబాద్‌లో ప్రారంభించి అనంతరం అన్ని జిల్లా కేంద్రాలకు విస్తరిస్తామని సమాఖ్య చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ వెల్లడించారు. గొర్రెల పంపిణీ పథకం ద్వారా రాష్ట్రంలో గొర్రెల సంఖ్య పెరిగిందన్నారు. అయినా మటన్ ధరలు తగ్గకపోవడంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
ఈనెల 12న మొబైల్ క్యాంటీన్ల ఏర్పాటుకు యోచిస్తున్నామని వెల్లడించారు.

Read also: Jailer: విజయ్, అజిత్ లు స్టార్స్ అవ్వొచ్చు కానీ రజినీ సూపర్ స్టార్ మచ్చా…

మటన్ క్యాంటీన్ నాణ్యమైన మటన్ ఉత్పత్తులు.. మటన్ బిర్యానీ, కీమా, తలకాయ కూర, మటన్ టిక్కా వంటి అన్ని రకాలు సరసమైన ధరలకు విక్రయిస్తామని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో ప్రభుత్వ ప్రోత్సాహం వల్లే గొర్రెలు, మేకల సంపద పెరిగింది. ప్రాథమిక పెంపకందారుల సొసైటీల ద్వారా గొర్రెల పెంపకందారులు లాభాలు గడిస్తున్నారు. ప్రైమరీ బ్రీడర్ సొసైటీలను ఇప్పుడు ఏర్పాటు చేయనున్న మటన్ మార్కెట్‌లకు అనుసంధానం చేస్తామని అధికారులు చెబుతున్నారు. నేరుగా మటన్ విక్రయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్న మటన్ క్యాంటీన్లలో కురుమ, యాదవ సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. పశుసంవర్థక శాఖ, పర్యాటక శాఖ, ఇతర శాఖల సమన్వయంతో ఈ క్యాంటీన్లను విజయవంతంగా నిర్వహిస్తామన్నారు.
Ramcharan : సనాతన ధర్మం పై వైరల్ అవుతున్న రాంచరణ్ పాత ట్వీట్..

Show comments