Ramcharan : సనాతన ధర్మం పై వైరల్ అవుతున్న రాంచరణ్ పాత ట్వీట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ నటుడు మరియు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు అయిన ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం పై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. దీనితో ఆయనపై దేశ వ్యాప్తంగా హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.తమిళనాడు మంత్రిగా బాధ్యత గల పదవి లో వున్న ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు అంటూ హిందూ సంఘాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పలు చోట్ల హిందూ సంఘ నాయకులు ఉదయనిధి స్టాలిన్ పై కేసులు కూడా పెడుతున్నారు.. ఉదయనిధి స్టాలిన్ ని సినీ అభిమానులు కూడా బాగా ట్రోల్ చేస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ ఇటీవల నటించిన మామన్నన్ చిత్రం మంచి విజయం సాధించింది.
ఇటీవల తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉదయనిధి స్టాలిన్.. డెంగ్యూ, మలేరియా ఎలాగో.. సనాతన ధర్మం కూడా అంతే. మనం కేవలం దానిని వ్యతిరేకించి ఊరుకోకూడదు దానిని నిర్మూలించాలి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.అయితే ఈ తరుణంలో సనాతన ధర్మం పై మెగా పవర్ స్టార్ రాంచరణ్ చేసిన పాత ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.2020లో రాంచరణ్ ‘సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం మనందరి భాద్యత.. భారతీయ కల్చర్ మ్యాటర్స్ అంటూ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో తన తల్లి సురేఖ తులసి మొక్కకు పూజ చేస్తున్న ఫోటోని కూడా రాంచరణ్ షేర్ చేశారు. అయితే ప్రస్తుతం సనాతన ధర్మం పై ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్ నేపథ్యంలో చరణ్ ట్వీట్ ని నెటిజన్లు బాగా వైరల్ చేస్తున్నారు.సనాతన ధర్మం పట్ల భాద్యత గల పదవిలో వున్న ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు మెగా పవర్ స్టార్ రాంచరణ్ వ్యాఖ్యలు ఎలా ఉన్నాయో చూడండి అంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు.. సనాతన ధర్మాన్ని పాటించాలి అంటూ వ్యాఖ్యలు చేసిన రాంచరణ్ పై ప్రశంసలు కురిపిస్తూ ఉదయనిధి స్టాలిన్ ను నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు.
Also Read
- IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
- Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
- Hyderabad: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య..
- Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
https://twitter.com/AlwaysRamCharan/status/1304400109568892929?s=20
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి మరో బిగ్ ట్రీట్.. మళ్లీ అప్పుడే ప్లాన్ చేశారా?
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
-
Hyderabad: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య..
-
Sigma OTT: అప్పుడే ఓటీటీలోకి ‘సిగ్మా’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ట్రెండింగ్
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!
-
Government Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్.. ఈ చిన్న తప్పులు చేస్తే లైఫ్ లాంగ్ బ్యాన్ కావడం ఖాయం!
-
OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!