NTV Telugu Site icon

Agnipath protest: కాల్పుల్లో మరణించిన రాకేష్ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం

Rakesh

Rakesh

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ స్కీమ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ జరిగిన ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసిన విషయం తెలిసిందే.. ఒక్కసారిగా స్టేషన్‌లోకి దూసుకొచ్చిన ఆందోళనకారులు విధ్వంసమే సృష్టించారు.. ఈ నెల తేదీన 17వ సికింద్రాబాద్‌ రైల్వేష్టేషన్‌లో యుద్ధ వాతావరణం నెలకొనగా.. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో దామెర రాకేష్‌ అనే యువకుడు ప్రాణాలు విడిచాడు.. ఇప్పటికే, ఆ కుటుంబానికి రూ.25 లక్షల పరిహారంతో పాటు, ఆ కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం విదితమే..

Read Also: Rega Kantha Rao: కాంగ్రెస్‌ గూటికి మాజీ ఎమ్మెల్యే.. టీఆర్ఎస్‌ కౌంటర్‌ ఎటాక్‌

కాగా… సీఎం కేసీఆర్‌ ఆదేశాలను అనుగుణంగా మృతుడు దామెర రాకేష్‌ సోదరుడు దామెర రామ్ రాజుకు ఉద్యోగం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దామెర రామ్ రాజు విద్యా అర్హతలకు అనుగుణంగా వరంగల్ జిల్లాలో తగిన ఉద్యోగం ఇవ్వాల్సిందిగా వరంగల్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశిస్తూ.. ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు సీఎస్‌ సోమేష్‌ కుమార్. ఇక, అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు జరిగాయి.. కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. దాడులకు తెగబడ్డారు ఆందోళనకారులు.. అయితే, అగ్నిపథ్ స్కీమ్‌ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గని కేంద్రం.. నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం విదితమే.