NTV Telugu Site icon

Ration Dealership: తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం.. రేషన్ డీల‌ర్‌షిప్ వయసు పరిమితి పెంపు

Telangana Governament

Telangana Governament

Ration Dealership: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ డీలర్లకు సంబంధించిన మరో సమస్యను తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించింది. రాష్ట్రంలోని ఆయా శాఖల్లో పేరుకుపోయిన సమస్యలు క్రమంగా పరిష్కారమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏళ్ల తరబడి రేషన్ డీలర్ల సమస్యను ప్రభుత్వం పరిష్కరించింది. డీలర్ మరణిస్తే కారుణ్య నియామకం ద్వారా అతని కుటుంబంలో ఒకరికి డీలర్ షిప్ ఇచ్చే వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం డీలర్‌షిప్‌కు అర్హత వయస్సు 40 ఏళ్ల వరకు ఉండగా, పరిమితిని మరో పదేళ్లు అంటే 50 ఏళ్లు పెంచుతూ పౌరసరఫరాల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే డీలర్ మరణిస్తే అతని కుటుంబ సభ్యులకు 50 ఏళ్ల వరకు డీలర్ షిప్ కేటాయిస్తారు. ఇదిలా ఉండగా.. రేషన్ డీలర్ షిప్ పొందే వ్యక్తికి 18 ఏళ్లు నిండి ఉండాలి. అయితే.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ నిబంధన నుంచి మినహాయింపు కోరే అవకాశం కూడా ఉంది. డీలర్ మరణించిన రెండేళ్ల తర్వాత ఈ నిబంధనతో సంబంధం లేకుండా డీలర్‌షిప్ కేటాయిస్తారు. డీలర్ మరణించిన తర్వాత రెండేళ్లపాటు ఈ నిబంధనతో సంబంధం లేకుండా డీలర్‌షిప్ ఉంటుంది. కానీ అర్హత ఉన్న వ్యక్తి డీలర్ మరణించిన వెంటనే డీలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.

Read also: MP Mopidevi Venkataramana: వైసీపీ ఎంపీకి నిరసన సెగ..

ఈ నెల 5న రేషన్ డీలర్లు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. తమ డిమాండ్లను పరిష్కరించాలని నిరసన తెలిపారు. గతంలో ఇచ్చిన హామీల మేరకు గౌరవ వేతనం ఇవ్వాలని, కూలీల ఛార్జీలు భరించాలని డిమాండ్‌ చేశారు. 10 లక్షల భీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. డీలర్ల సమ్మె కారణంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేషన్ పంపిణీ నిలిచిపోనుంది. అయితే సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న రేషన్ డీలర్లతో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమల్కర్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. జూన్ 7, 2023న డీలర్లు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. రేషన్ దుకాణాలు తెరిచి సరుకులు పంపిణీ చేశారు. సచివాలయంలో రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధులతో మంత్రి సమావేశమై.. గతంలో ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ ఆకలితో అలమటించకూడదన్న సీఎం కేసీఆర్ లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ఇందుకు రేషన్ డీలర్లు సహకరించాలని మంత్రి కోరారు. కమీషన్ పెంపు ప్రతిపాదనను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. వెంటనే సమ్మె విరమించి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ పంపిణీ ప్రారంభిస్తామని రేషన్ డీలర్ల జేఏసీ చైర్మన్ నాయికోటి రాజు, ఇతర నాయకులు మంత్రి సమక్షంలో ప్రకటించారు. అంతేకాకుండా.. ఈనెల 22న రేషన్ డీలర్ల సంఘాలతో సమావేశం ఉంటుందని ప్రకటించారు. అయితే ఈనేపథ్యంలో జూన్ 22 రాకముందే రేషన్ డీలర్లకు సంబంధించిన మరో సమస్యను తెలంగాణ సర్కార్ పరిస్కరించడంతో డీలర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Donald Trump: ట్రంప్ మామ ఏంటి ఇది? ఇష్టమొచ్చినంత తినమన్నాడు.. బిల్లు టైంకు జారుకున్నాడు..!