Site icon NTV Telugu

Muslim Marriages: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పెళ్లిళ్లకు అవి తప్పనిసరి లేదంటే..

Muslim Marrige Adhar Card

Muslim Marrige Adhar Card

Telangana Government: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మైనర్ వివాహాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మైనర్ వివాహాలు, అరబ్ షేక్ లు మైనర్లకు పెళ్లిళ్లు చేసి ఒప్పంద పద్ధతిలో తమ దేశానికి తీసుకెళ్లిన ఘటనలు రాష్ట్రంలో వెలుగు చూస్తున్నాయి. దీన్ని నియంత్రించేందుకు వధూవరుల ఆధార్ కార్డులను తప్పనిసరిగా తీసుకెళ్లాలని, పెళ్లి సమయంలో వారి వయస్సును ధృవీకరించాలని తెలంగాణ ప్రభుత్వం వక్ఫ్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. షాదీ వివరాలను ఆన్‌లైన్‌లో కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. గతంలో మాదిరిగా ఖాజీల ప్రకారం వివాహాలు చేయడం కుదరదని, ఆధార్ కార్డు తీసుకుని వయస్సును సరిచూసుకోవాలని ఆదేశించారు.

Read also: Omicron BF7: కరోనా బూస్టర్ డోస్ గా ముక్కులో చుక్కల మందు

మైనర్, కాంట్రాక్ట్ వివాహాలు చేసే ఖాజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఖాజీల నియామకం మైనారిటీ శాఖ ద్వారా జరగదని, జిల్లా కలెక్టర్లకే బాధ్యతలు అప్పగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ముస్లింల షాదీ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతోపాటు వివాహ ధ్రువీకరణ పత్రాలను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. వివాహ ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా హైదరాబాద్ హజ్‌హౌస్‌లోని నజీరుల్ ఖాజత్ కార్యాలయానికి వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.అన్నింటిని అధికారులు పరిశీలించి వివాహ ధ్రువీకరణ పత్రాన్ని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాంట్రాక్ట్‌, మైనర్‌ వివాహాలను అరికట్టేందుకు ఆన్‌లైన్‌ విధానాన్ని తీసుకొచ్చామని, ఆధార్‌ కార్డులను తప్పనిసరి చేశామని ప్రభుత్వం తెలిపింది.

Read also: Kotamreddy Sridhar Reddy: వైసీపీ ఎమ్మెల్యే ఫైర్‌.. మంత్రులు, కలెక్టర్లు మారారు.. పనులు మాత్రం కావడం లేదు..!

అరబ్ షేక్ లు రాష్ట్రానికి వచ్చి మైనర్ బాలికలకు పెళ్లిళ్లు చేసి సొంత దేశానికి తీసుకెళ్తున్నారు. కొన్ని రోజుల తర్వాత వారిని అక్కడే వదిలేస్తారు.దీంతో చాలా మంది బాలికలు అన్యాయానికి గురవుతున్నారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పాతబస్తీ తదితర ప్రాంతాల్లో ఇలాంటి మైనర్ వివాహాలు అనేకం జరుగుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. గతంలో పాతబస్తీలో పలువురు అరబ్ షేక్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్ల వివాహాలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో వివాహాల నమోదు, ఆధార్ కార్డులను తప్పనిసరి చేయడం వల్ల మైనర్ వివాహాలను నిరోధించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఖాజీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించి మైనర్ వివాహాలు చేసుకోకుండా ప్రభుత్వం చూస్తోంది. ప్రభుత్వ నిర్ణయం ఎంతవరకు ప్రభావం చూపుతుంది? మైనర్ వివాహాలను నిరోధించవచ్చా? అనేది చూడాలి.
Kaikala Satyanarayana: ఆరు దశాబ్దాల కైకాల సినీ ప్రయాణం..

Exit mobile version