Site icon NTV Telugu

ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌.. ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్

ts govt

ts govt

ఉద్యోగుల‌కు శుభ‌వార్త చెప్పింది తెలంగాణ ప్ర‌భుత్వం.. ఉద్యోగుల పరస్పర బదిలీలకు (mutual transfers) గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.. దీనికి సంబంధించిన ఉత్త‌ర్వులు జారీ చేసింది.. ప్ర‌భుత్వ ఉత్త‌ర్వుల ప్ర‌కారం.. బదిలీ కోరుకునే ఉద్యోగులు మార్చి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు క‌ల్పించింది స‌ర్కార్.. ఇక‌, ఉద్యోగులు మ్యూచువల్‌ను వెతుక్కోవ‌డానికి నెల రోజుల అవకాశం ఉంటుంది.. దీంతో, ఒక ప్రాంతంలో ఉద్యోగం చేయడం ఇష్టం లేని వారు.. మరో ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్న వారిని.. పరస్పర అంగీకారంతో బ‌దిలీపై తాను కోరుకున్న ప్రాంతానికి వెళ్లే అవ‌కాశం ఉంటుంది.. కాగా, కొత్త జోన‌ల్ వ్య‌వ‌స్థ‌లో బ‌దిలీల‌పై తీవ్ర ఆందోళ‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి.. ఇప్ప‌టికే ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున నిర‌స‌న కార్య‌క్ర‌మ‌లు నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే కాగా.. ప‌ర‌స్ప‌ర బ‌దిలీల‌కు అవ‌కాశం ఇవ్వ‌డంతో.. కొంద‌రికైనా ఉప‌శ‌మ‌నం క‌లిగే అవ‌కాశం ఉండ‌బోతోంది.

Read Also: ఫేక్ న్యూస్‌.. గూగుల్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌పై కేంద్రం సీరియ‌స్‌..!

Exit mobile version