NTV Telugu Site icon

Telangana Govt: అంగన్‌వాడీలకు దసరా కానుక.. ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా..

Anganvadi

Anganvadi

Telangana Govt: అంగన్‌వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. వీరికి ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయించారు. త్వరలో ప్రకటించనున్న పీఆర్సీలో అంగన్‌వాడీలను కూడా చేర్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అలాగే మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ నిర్ణయాలను మంత్రి హరీశ్ రావు ఆదివారం వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణలోని 70 వేల మంది అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు లబ్ధి పొందనున్నారు. మంత్రులు హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్‌లతో అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నాయకులు ఆదివారం సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా అంగన్‌వాడీల డిమాండ్లపై మంత్రులు సానుకూలంగా స్పందించారు. అంగన్‌వాడీలతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు. మిగిలిన డిమాండ్లపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ మాట్లాడుతూ అంగన్‌వాడీల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. కాగా, తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించడం పట్ల అంగన్‌వాడీ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావులకు కృతజ్ఞతలు తెలిపారు.
Naga Bhushana: ఫుట్ పాత్ పై వెళ్తున్న వారికి యాక్సిడెంట్ చేసిన నటుడు… ఒకరు భార్య మృతి