Site icon NTV Telugu

Telangana: కేఆర్‌ఎంబీకి మరోలేఖ.. 50:50 నిష్పత్తిలో నీళ్లు..!

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవడం.. ఆరోపణలు చేయడం, విమర్శలు గుప్పించుకోవడం కొనసాగుతూనే ఉంది.. ఇక, లేఖల పరంపరం ఎప్పుడూ ఆగింది లేదు.. తాజాగా, కేఆర్ఎంబీ చైర్మన్‌కు లేఖ రాశారు తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్… ఈ నీటి సంవత్సరంలో కృష్ణా బేసిన్‌లో 50 : 50 నిష్పత్తిలో నీటి కేటాయింపులు చేయాలని కోరారు.. గత కేఆర్ఎంబీ మీటింగ్ లో తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యతలు చెప్పినప్పటికీ.. బోర్డు మినిట్స్‌లో పొందుపర్చలేదన్నారు. కృష్ణా బేసిన్‌లో నీటిని ఏపీ కేటాయింపులకు మించి వినియోగించుకోకుండా కేఆర్ఎంబీ కట్టడి చేయాలని సూచించారు.

Read Also: Prashant Kishor: ప్రశాంత్‌ కిషోర్‌ బీహార్‌ ప్రయోగం వెనక రాజకీయం..!

Exit mobile version