Sankranti Holidays: జనవరి అనగానే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది సంక్రాంతి సెలవులు. ఎప్పుడెప్పుడు సంక్రాంతి సెలవులు ప్రకటిస్తారు అన్నట్లు వేచిచూస్తాము. ఆ సమయం రానే వచ్చింది. ఇవాళ తెలంగాణ సర్కార్ సంక్రాంతి సెలవులు ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు, కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. పాఠశాలలకు 5 రోజులపాటు సెలవులు కాగా.. ఇక కాలేజీలకు 3 రోజులు మాత్రమే సెలవులు ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. ఇక రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలకు జనవరి 13 నుంచి 17 వరకు 5 రోజుల సంక్రాంతి సెలవులు ఇచ్చారు. అయితే.. ఈనెల జనవరి14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగ ఉండగా, జనవరి 17న కూడా సెలవురోజుగా ప్రకటించారు. కాగా.. జనవరి 18న పాఠశాలలు పున:ప్రారంభమవుతాయని ప్రకటించింది తెలంగాణ సర్కార్.
Read also: Chain Snatchers: రెచ్చిపోయిన చైన్స్ స్నాచర్స్.. గంటల వ్యవధిలోని ఆరు చోట్ల దోపిడి
కాలేజీలకు మూడు రోజులు మాత్రమే..
ఇక ఇంటర్ కాలేజీలకు కేవలం 3 రోజులు మాత్రమే సంక్రాంతి సెలవులు ప్రకటించారు. ఈనెలలో 13 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. ఇక..జనవరి 16న కనుమ పండుగ ఉండగా అదేరోజు కాలేజీలు తెరచుకోనున్నాయి. అయితే.. ఈ సారి సంక్రాంతి పండుగ ఆదివారం రోజు, భోగి రెండో శనివారం రోజు రావడంతో విద్యార్థులు, ఉద్యోగులంతా నిరాశలో ఉన్నారు. ఇక సంక్రాంతికి ప్రత్యేక సెలవులను కోల్పోయామనే భావన వారిలో ఉంది.
జనవరి నెలలో సెలవులు:
* జనవరి నెలలో భారీగా సెలవులు రానున్నాయి. కాగా.. సాధారణ సెలవుల్లో జనవరి 1వ తేదీని ప్రభుత్వం పేర్కొంది. ఈసారిమాత్రం జనవరి 1న ఆదివారం రోజు రావడంతో విద్యార్థులు ఉద్యోగులు అదనపు సెలవును పొందే ఛాన్స్ మిస్ అయ్యింది.
* ఈనెల భోగి పండుగా జనవరి 14న వచ్చింది. ఆ రోజు సైతం సాధారణ సెలవును ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. ఆ రోజు రెండో శనివారం. దీంతో విద్యార్థులు మరో సెలవును కోల్పోతున్నారు.
* అయితే..భోగి మరుసటి రోజు జనవరి 15న సంక్రాంతి ఉంటుంది. అయితే.. సంక్రాంతి కూడా సెలవుదినమైన ఆదివారం రోజే రావడం మరో నిరాశ కలిగించే అంశం. 16న సోమవారం కనుమ పండుగకు ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేను ప్రకటించింది.
* కాగా.. ఆదివారాలు, రెండో శనివారం కలిపితే జనవరిలో బోలెడు సెలవులు వస్తాయి. ఆయా తేదీల్లో విద్యాసంస్థలకు సెలవులు ఉంటాయి.
* జనవరి 26న రిపబ్లిక్ డే గురువారం రోజు వచ్చింది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతో పాటు విద్యాసంస్థలకు ఆ రోజు సెలవు ఉంటుంది.
* ఇక ఈనెల జనవరి 8, 22, 29 తేదీల్లో ఆదివారం ఉంటుంది. దీనివల్ల ఆయా రోజుల్లో సెలవు ఎలాగూ ఉంటుంది. ఇంకా జనవరి 28న నాలుగో శనివారం కావడంతో బ్యాంకులకు ఆ రోజు సెలవు ఉంటుంది.
CBI Investigations: హైదరాబాద్ లో సీబీఐ సోదాలు.. పాతబస్తీలో ఆరు చోట్ల అధికారులు తనిఖీలు