Ganesh Visarjan : గణేష్ నిమజ్జనానికి సెలవు.. ఆ రోజు మాత్రం పని.!

  • వినాయక నిమజ్జనానికి సెప్టెంబర్ 25న సాధారణ సెలవు
  • హైదరాబాద్‌తో పాటు రెండు జిల్లాల్లో సెలవు వర్తింపు
  • నిమజ్జన శోభాయాత్రల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం
  • నవంబర్ 14న రెండో శనివారం పనిదినంగా ప్రకటన
Ganesh Visarjan

Ganesh Visarjan

Ganesh Visarjan : వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25వ తేదీ (శుక్రవారం) నాడు హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు సమీపంలోని రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల పరిధిలో సాధారణ సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిమజ్జన శోభాయాత్రల నేపథ్యంలో రవాణా, భద్రత , ట్రాఫిక్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని పరిధిలోకి వచ్చే పరిపాలనా విభాగాలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు , కళాశాలలకు ఈ సెలవు వర్తిస్తుంది.

రెండో శనివారం పనిదినం.. జీఓ జారీ చేసిన సీఎస్

అయితే ఈ సాధారణ సెలవుకు పరిహారంగా రాబోయే నవంబర్ 14వ తేదీని (రెండో శనివారం) పూర్తిస్థాయి పనిదినంగా పరిగణించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారిక జీఓ విడుదల చేశారు. నవంబర్ 14న సంబంధిత అన్ని ప్రభుత్వ కార్యాలయాలు , విద్యాసంస్థలు యథావిధిగా పనిచేస్తాయని, ఉద్యోగులు, విద్యార్థులు , ప్రజలు ఈ మార్పును గమనించాలని అధికారులు సూచించారు.