NTV Telugu Site icon

కోవిడ్‌ మృతులకు ఎక్స్‌గ్రేషియా.. తెలంగాణ సర్కార్‌ మార్గదర్శకాలు

Covid 19

Covid 19

కరోనా మహమ్మారి బారినపడి మృతిచెందినవారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.. కోవిడ్‌ సోకి మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు రూ. 50 వేలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపింది.. రాష్ట్ర విపత్తుల నిర్వహ‌ణ నిధుల నుంచి ఈ ప‌రిహారం అంద‌జేయ‌నుండగా.. ఈ మేర‌కు మార్గద‌ర్శకాలను జారీ చేసింది తెలంగాణ సర్కార్.. ఇక, కోవిడ్‌ డెత్ స‌ర్టిఫికెట్ జారీ చేసేందుకు అధికారుల‌తో ఓ క‌మిటీని ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది ప్రభుత్వం.. మృతుల కుటుంబ స‌భ్యుల ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.. ఈ ద‌ర‌ఖాస్తుల‌ను ఆయా జిల్లాల క‌లెక్టర్లు ప‌రిశీలించి అర్హులైన వారికి ప‌రిహారం అందజేస్తారని తెలిపింది.. మృతుల కుటుంబ సభ్యుల నుంచి ద‌ర‌ఖాస్తు అందిన 30 రోజుల్లో అర్హులైన వారికి, ఆధార్‌తో లింకు ఉన్న బ్యాంకు ఖాతాల్లో ఈ సొమ్ము జమ చేయనున్నట్టు వెల్లడించింది.