NTV Telugu Site icon

Viral News: నీ ఐడియా ముందు ఇంజనీర్స్ వేస్టే బాబాయ్.. అదిరిపోలే..

Telangana Former

Telangana Former

వ్యవసాయం చెయ్యాలంటే పొలం ఉంటే సరిపోదు.. దున్నడానికి కాడి ఎడ్లు ఉండాలి.. బాగా స్థోమత ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద వ్యవసాయ పనిముట్లు లేదా ట్రాక్టర్ వంటి వి ఉండాలి.. ఇవి లేకుండా వ్యవసాయం చెయ్యడం సాధ్యం కాదు.. కానీ ఓ రైతన్న సాధించి చూపాడు.. ట్రెండ్ కు తగ్గట్లు తెలివికి పని పెట్టాడు.. అంతే ఏముంది టివిఎస్ ఎక్సెల్ కు నాగలి కట్టి పొలాన్ని దున్నాడు.. అతని తెలివికి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఫిదా అవుతున్నారు.. అతను దున్నే విధానంకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.. వీడియో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాలకే వైరల్ అవుతుంది..

వివరాల్లోకి వెళితే.. కింద కనిపిస్తున్న వ్యక్తి సొంకాంబ్లీ బాబు.. ఊరు నిర్మల్ జిల్లా ముథోల్.. దుక్కులు దున్నేందుకు ఎద్దుల కొరతతో యంత్రాలతోనైనా సాగు చేద్దామనుకున్నాడు. ట్రాక్టర్ల కోసం ప్రయత్నం చేసినా సీజన్ కావడంతో ట్రాక్టర్లు రేట్లు దండిగా పెంచేశారు. చేసేది లేక ఇదిగో ఇలా ఇంటి వాహనాన్నే వ్యవసాయానికి సాయంగా వాడేశాడు. ముదోల్ మండల కేంద్రానికి చెందిన సొంకాంబ్లీ బాబు అనే రైతు తన పంట చేనులో వేసిన పత్తి పంటలో గుంటుకు కొట్టడానికి వినూత్నంగా ఆలోచించాడు.. అతను చేసిన పనికి రాష్ట్ర ప్రజలంతా అతని ఆలోచనను మెచ్చుకుంటున్నారు..

ఇక లూనాను ఇలా వ్యవసాయ పనులకు వాడటంతో ఇదేదో బాగుందే అంటూ ఆ ప్రాంత రైతులు కూడా అదే బాటపట్టారంట. అదిరిందయ్యా కాంబీ అంటూ బాబును పొగడ్తల వర్షంలో ముంచెత్తుతున్నారంట. విభిన్నమైన ఆలోచనలతో వినూత్న పనులు చేపట్టవచ్చని నిరూపించిన రైతు సొంకాంబ్లీని సమీప ప్రాంత రైతులు అభినందిస్తున్నారు. గుంటుకు కొట్టడానికి ఎడ్లు లేకున్నా తన లూనాను ఉపయోగించి వ్యవసాయ పనులు పూర్తి చేయడంతో ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతో అయ్యిందని ఆయన అంటున్నారు.. ఎకరంనర భూమిలో వేసిన పత్తిలో ఇంటి పనులకు వాడే లూనాను ఇలా గుంటుకు కొట్టడానికి వాడక తప్పలేదని తెలిపాడు. తన కొడుకు సాయం కూడా ఆర్థిక ఇబ్బందులను గట్టెక్కేలా చేసిందని ఆయన అంటున్నారు.. మొత్తానికి అతను ఇప్పుడు రైతుల్లో రారాజు అయ్యాడు..