75సంవత్సరాలలో స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రమూ సాధించని విజయాలను ఎనిమిదేండ్లలోనే తెలంగాణ సాధించిందని కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్లలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద అమర వీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా.. రాజన్న సిరిసిల్ల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మహోద్యమంలో.. పాలుపంచుకున్న వారందరికి ప్రత్యేక వందనాలు తెలిపారు. తెలంగాణ రాష్ర్ట సాధనకోసం అమరులైన వారందరికి నివాళులర్పించారు. తెలంగాణ 8వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు మనం జరుపుకోవడం చాలా సంతోషంగా వుందని తెలిపారు. ఎన్నిదేండ్లలో తెలంగాణ సాధించిన ప్రగతి గూర్చి విశ్లేసించారు కేటీఆర్.
దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తూ నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి తో సమస్యలు పరిష్కరిస్తామని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ 20 గ్రామాల్లో 19 గ్రామాలు తెలంగాణలో ఉండడమే తమ పనితీరుకు నిదర్శనం అన్నారు. ప్రతి గ్రామంలో ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, రైతు వేదికలు నిర్మించుకున్నామన్నారు.