Site icon NTV Telugu

Telangana: నిరుద్యోగులు సిద్ధంగా ఉండండి.. తొలి నోటిఫికేషన్ పోలీస్ శాఖ నుంచే..!!

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 80వేల ఉద్యోగ నియామకాలకు సంబంధించి తొలి నోటిఫికేషన్ పోలీస్ శాఖ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు తెలంగాణ పోలీసు శాఖలో 18,334 పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ప్రభుత్వం ఈ వారంలో గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే.. ఆ తర్వాత ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పోలీస్ శాఖ నుంచి ప్రభుత్వానికి చేరిన ప్రతిపాదనలో తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ బెటాలియన్, సివిల్, ఆర్మ్‌డ్‌(ఏఆర్‌), కమ్యూనికేషన్‌ విభాగాల్లో పోస్టుల భర్తీ ఉండనున్నట్లు తెలుస్తోంది.

18,334 ఖాళీలలో 1,500కు పైగా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ పోస్టులను పోలీస్‌ శాఖ ప్రతిపాదించినట్లు సమాచారం. నూతన జిల్లాలు, రేంజ్‌లను దృష్టిలో పెట్టుకుని సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇక మిగిలినవన్నీ కానిస్టేబుల్‌ పోస్టులు కాగా, వాటిని ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌(ఏఆర్‌), టీఎస్‌ఎస్‌పీ, కమ్యూనికేషన్‌ విభాగాల్లో నియామకానికి ప్రతిపాదించినట్లు పోలీస్‌ వర్గాలు వెల్లడించాయి.

https://ntvtelugu.com/chicken-prices-are-increased-in-telugu-states/
Exit mobile version