మద్యం పాలసీ గడువు ముగియనున్న నేపథ్యంలో.. కొత్త మద్యం పాలసీపై కసరత్తు ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం.. దీనిపై ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.. ఒకటి రెండు రోజుల్లో మద్యం పాలసీ ఖరారు చేసే విధంగా ముందుకు సాగుతున్నారు. కసరత్తు పూర్తి అయిన తర్వాత వైన్ షాపులకు టెండర్ల షెడ్యూల్ విడుదల చేయనుంది ఎక్సైజ్ శాఖ.. కొత్త మద్యం పాలసీ 2021 డిసెంబర్ 1వ తేదీ నుండి అమల్లోకి రానుండగా… 2023 నవంబర్ 30వ తేదీతో ముగియనుంది.. అయితే, కొత్త పాలసీ ఎలా ఉండబోతోంది అనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది..
దరఖాస్తు ఫీజు, స్లాబ్స్ పై వైన్ షాపులు పెట్టాలనుకునేవారిలో టెన్షన్ మొదలైంది.. 2019లో దరఖాస్తు ఫీజు రూ. 2 లక్షలుగా ఉండగా.. ఇప్పుడు పెంచేందుకు కసరత్తు జరుగుతోంది.. మరోవైపు.. రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్య ఇప్పుడు 2,216గా ఉన్నాయి.. ఆ సంఖ్యను కూడా పెంచనున్నారు.. ఇక, ఇప్పటి వరకు ఎక్సైజ్ పాలసీలో 6 స్లాబ్స్ ఉండగా.. కొత్త స్లాబ్స్ ప్రేశపెట్టే అవకాశం కూడా ఉందంటున్నారు. మరోవైపు.. ఈ సారి మద్యం దుకాణాల్లో గౌడ్స్ కి 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించనుంది సర్కార్..
