తెలంగాణలో గుంట భూమి ఉన్నా.. రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలను వర్తింపజేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.. అయితే, రాష్ట్రంలోని 148 మంది రైతులకు రైతు బంధు ఆపాలని తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది ఎక్సైజ్‌శాఖ.. గంజాయి పండిస్తున్న రైతులకు రైతు బంధు కట్ చేయాలని కోరింది.. గంజాయి పండిస్తున్న 148 మంది రైతులపై 121 కేసులు నమోదు అయినట్టు సీఎం దృష్టికి తీసుకెళ్లింది ఎక్సైజ్ శాఖ.. గంజాయి సాగు చేస్తున్న వీరికి రైతు బంధు నిలిపివేయాలని లేఖలో పేర్కొంది.
Read Also: BJP: అధిష్టానం తీవ్ర కసరత్తు.. సీఎంల ఎంపికపై సస్పెన్స్..!
ఇక, సీఎం కేసీఆర్ ఆదేశాలతో తెలంగాణ జిల్లాల్లో విస్తృతంగా తనిఖీలు చేసింది ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్.. ఈ నేపథ్యంలో నారాయణ్‌ఖేడ్, మహబూబాబాద్, జహీరాబాద్, వరంగల్, భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌కి చెందిన రైతులపై కేసులు నమోదు చేసింది.. ఇదే సమయంలో.. జూన్‌లో వస్తున్న రైతుబంధును రైతులకు ఇవ్వొద్దని సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో పేర్కొంది ఎక్సైజ్‌శాఖ.. నల్గొండ, సూర్యాపేటలో సైతం గంజాయి పండిస్తున్న రైతుల వివరాలు సేకరించిన ఎక్సైజ్‌శాఖ.. 148 మంది రైతుల ఆధార్‌కార్డులు, ల్యాండ్ డాక్యుమెంట్లను కలెక్టర్లకు పంపింది… వీరంతా శీలావతి అనే గంజాయి మొక్కలను పండిస్తున్నట్టు తమ తనిఖీల్లో గుర్తించారు ఎక్సైజ్‌శాఖ అధికారులు.
