NTV Telugu Site icon

Telangana State Symbol: జూన్ 2న తెలంగాణ చిహ్నం విడుదల..

Revanth Reddy

Revanth Reddy

Telangana state symbol: జూన్ 2న తెలంగాణ చిహ్నం విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. గతంలో ఉన్న తెలంగాణ చిహ్నంలో చార్మినార్, వరంగల్ కాకతీయ తోరణం తొలగిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ వార్తపై ఇంకా క్లారిటీ రాలేదు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రతిబింబించే విధంగా సర్కార్ చిహ్నం తయారు చేస్తున్నట్లు తెలిపింది. అమరుల స్తూపం, రామప్ప, మూడు సింహాల గుర్తులు ఉండేలా తయారు చేస్తున్నట్లు విశ్వనీయం సమాచారం. జూన్ 2 నాటికి పూర్తిస్థాయిగా పలుమార్పులు చేర్పులు చేసి ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక జూన్ రెండవ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలియజేశారు.

Read also: Namitha Divorce: విడాకుల రూమర్స్‌.. నమిత ఏమన్నారంటే?

జూన్ 2 వ తేదీన ఉదయం గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన అమరులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నివాళులు అర్పించిన అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై నేడు డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సి.ఎస్ శాంతి కుమారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సి.ఎస్ మాట్లాడుతూ, పరేడ్ గ్రౌండ్ లో ఉదయం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించడంతో పాటు, సందేశం ఉంటుందని తెలిపారు. సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ట్యాంక్ బండ్ పై రాష్ట్రంలోని అన్ని కళారూపాలతో పెద్ద ఎత్తున కార్నివాల్ నిర్వహించనున్నట్టు తెలిపారు. దీనితో పాటు, శిక్షణ పొందుతున్న 5000 మంది పోలీస్ అధికారులు బ్యాండ్ తో ఈ ప్రదర్శనలో పాల్గొంటారని అన్నారు.
Hyderabad: మండి బిర్యానీ తిని ఆసుపత్రి పాలైన కుటుంబం.. 8 మందికి అస్వస్థత..