NTV Telugu Site icon

TG ECET Results: మరికాసేపట్లో తెలంగాణ ఈసెట్‌ ఫలితాలు..

Ecet Result

Ecet Result

TG ECET Results: టీజీ ఈసెట్ ఫలితాలు మరొ కొద్ది సేపట్లో విడుదల కానున్నాయి. మసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి మధ్యాహ్నం 12.30 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈసెట్ కన్వీనర్ పి.చంద్రశేఖర్ ప్రకటించారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులకు ఈసెట్ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. ఈసెట్ ఫలితాల కోసం ఈ వెబ్‌సైట్ https://ecet.tsche.ac.in/ లాగిన్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చని చంద్రశేఖర్ వెల్లడించారు. టీఎస్ ఈసెట్ ప్రవేశ పరీక్షను మే 6న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించారు. ఈ పరీక్షకు తెలంగాణ జిల్లాల్లో 48, హైదరాబాద్ రీజియన్‌లో 44, ఏపీలో 7 కేంద్రాలు మొత్తం 99 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 24 వేల మందికి పైగా విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.

Read also: RR vs KKR: లీగ్ దశలో చివరి మ్యాచ్.. కేకేఆర్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా..

మరోవైపు తెలంగాణలో PGESET-2024 పరీక్షల షెడ్యూల్ మారింది. ఈ మేరకు అధికారులు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. TSPSC గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షల నేపథ్యంలో PGECET రాత పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు కన్వీనర్ డాక్టర్ ఎ అరుణ కుమారి వెల్లడించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం.. PGESET పరీక్షలు జూన్ 6 నుండి ప్రారంభం కానున్నాయి. జూన్ 9వ తేదీలోగా పరీక్షలు పూర్తి కావాలి. అయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు, టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షల నేపథ్యంలో పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేశారు. తెలంగాణ పీజీఈసెట్ రాత పరీక్షలు జూన్ 10 నుంచి ప్రారంభమవుతాయి. జూన్ 13న పూర్తవుతాయి. ఇంజినీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ పీజీఈసెట్ (టీఎస్ పీజీఈసెట్ 2024) నిర్వహిస్తున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి ఎంఈ, ఎంటెక్, ఫార్మసీ, ఫార్మా-డి కోర్సుల్లో ప్రవేశాలు జరుగుతాయి. పూర్తి వివరాలను తెలుసుకోవడానికి అభ్యర్థులు https://pgecet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
AP-Telangana Rains: ఏపీ, తెలంగాణల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్..