తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వానలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదిలా ఉంటే భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలో జరగాల్సిన ఎంసెట్, ఈసెట్ పరీక్షలు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13 న ఈసెట్… ఈ నెల 14 నుంచి ఎంసెట్ ఎగ్జామ్స్ జరగాలి. అయితే తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు పడుతున్న క్రమంలో వీటిని వాయిదా వేసే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం ఉన్నత విద్యా మండలి అధికారులు సమావేశం కానున్నారు. ఎగ్జామ్స్ వాయిదాపై ప్రభుత్వంతో చర్చింది తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
Read Also: Cricket: ప్రపంచం ఓ వైపు.. టీమిండియా మరోవైపు.. మ్యాచ్ నిర్వహణకు కేంద్రం సన్నాహాలు
భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. పాఠశాలలు, కళాశాలు, డిగ్రీ, టెక్నికల్, నాన్ టెక్నికల్ అన్ని కళాశాలు మూడు రోజుల పాటు మూతపడనున్నాయి. ఇప్పటికే ఉస్మానియా, తెలంగాణ, జెఎన్టీయూ యూనివర్సిటీలు తమ కళశాలల్లో పరీక్షలను రద్దు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఎంసెట్, ఈసెట్ కూడా వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వానలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ప్రజలు అందరూ ఇళ్లకే పరిమితం కావాలని సీఎం కేసీఆర్ కోరారు. మరోవైపు ప్రభుత్వం అన్ని జిల్లాల్లో అప్రమత్తం అయింది.
