Site icon NTV Telugu

Big Breaking: ఎంసెట్‌ వాయిదా

Telangana Eamcet

Telangana Eamcet

అనుకున్నట్టే జరిగింది.. చివరకు ఎంసెట్‌ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి.. రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగుతోన్న నేపథ్యంలో.. రేపటి నుంచి జరగాల్సిన ఎంసెట్‌ ఉంటుందా? ఉండదా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.. అయితే, ఇవాళ పాలిసెట్‌ ఫలితాలు విడుదల చేసిన సందర్భంగా షెడ్యూల్‌ ప్రకారమే ఎంసెట్‌ ఉంటుందని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ స్పష్టం చేశారు.. కానీ, ఆ తర్వాత కొంత సమయానికే ఎంసెట్‌ను వాయిదా వేస్తూ ప్రకటన విడుదల చేసింది ఉన్నత విద్యామండలి.

Read Also: Hijab Row: హిజాబ్ అంశంపై వచ్చే వారం సుప్రీంలో విచారణ

రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వారు అంచనా వేయడంతో.. ఈ ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో వుంచుకొని సంబంధిత అధికారులతో సమీక్షించి, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, ఈ నెల 14 మరియు 15వ తేదీల్లో జరగాల్సిన TS EAMCET (AM)-2022 (అగ్రికల్చర్ స్ట్రీమ్) పరీక్షను మాత్రేమే వాయిదా వేయాలని నిర్ణయించడం జరిగిందని ఓ ప్రకటనలో పేర్కొంది ఉన్నత విద్యామండలి.. మరియు ఈ పరీక్షను నిర్వహించే తదుపరి తేదీల వివరాలను త్వరలోనే తెలియజేయడం జరుగుతుందని పేర్కొన్నారు.. అయితే, ఇంజినీరింగ్ స్ట్రీమ్ కోసం TS EAMCET- 2022 నిర్వహణ ముందుగా నోటిఫై చేయబడిన షెడ్యూల్ ప్రకారం, అనగా 18 జులై నుండి 20 జులై 2022 వరకు జరిగే పరీక్షలు, యథావిథిగా నిర్వహించబడుతాయని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొ.ఆర్. లింబాద్రి పేరుతో ఓ ప్రకటన విడుదలైంది.

Exit mobile version