Site icon NTV Telugu

కరోనా: డీహెచ్ శ్రీనివాస్‌ ఆందోళన.. అలా చేయొద్దని విజ్ఞప్తి

Srinivasa Rao

Srinivasa Rao

రాష్ట్రంలో కరోనా మహమ్మారి అదుపులోనే ఉందన్నారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్‌ శ్రీనివాస్‌.. ప్రస్తుతం కరోనా పరిస్థితులపై మీడియాతో మాట్లాడిన ఆయన.. సేకండ్ వేవ్ ప్రభావం ఇంకా తగ్గలేదని.. ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో కేసులు అధికంగానే ఉన్నాయని తెలిపారు.. డెల్టా వేరియంట్‌ భారత్ సహా 135 దేశాల్లో తీవ్రంగా ఉందన్న ఆయన.. నిన్న దేశంలోని 50 శాతం కేసులు ఒక కేరళలోనే వెలుగుచూశాయన్నారు.. డెల్టా వైరస్ శరీరం పై ఎక్కువ కాలం తీవ్ర ప్రభావాన్ని చూపడంతో పాటు ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యాన్ని గమనించినట్టు వెల్లడించారు.. హైదరాబాద్ లో డెల్టా ప్లస్ కి సంబంధించి రెండు కేసులు నమోదయ్యాయని తెలిపిన శ్రీనివాస్.. అయితే, కొందరు కరోనా పాజిటివ్‌గా తేలినా.. ఐసోలేషన్‌లో ఉండకుండా బయట తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. పాజిటివ్‌గా తేలితే ఐసోలేషన్‌లోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9 జిల్లాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయన్నారు డీహెచ్‌ శ్రీనివాస్‌.. థర్డ్‌ వేవ్‌ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంటుందని ఆయన.. మంచిర్యాల, పెద్దపల్లి, గ్రేటర్‌ హైదరాబాద్‌, ఖమ్మం వంటి చోట్లా ఔట్ బ్రేక్స్ చూస్తున్నామని తెలిపారు.. ఇక, భవిష్యత్తులో వ్యాక్సిన్ వేసుకున్న వారినే హోటల్స్, మాల్స్‌లోకి అనుమతించే అవకాశం ఉంటుందన్నారు శ్రీనివాస్.. ఈ నెలలో ఇప్పటి వరకు 30.04 లక్షల డోసుల వ్యాక్సిన్ వచ్చిందని.. కేటాయించిన దానికన్నా 9.5 లక్షల డోస్ లు అదనంగా రాష్ట్రానికి వచ్చాయన్న ఆయన.. వచ్చే ఒకటి రెండు వారాల్లో 2 డోస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు వెల్లడించారు.. డెల్టా వేరియంట్లు ప్రమాదకరం అని హెచ్చరించిన ఆయన.. ఇంటా బయటా ప్రజలు మాస్క్ లు ధరించాలని సూచించారు.. మరోవైపు.. ఆక్సిజన్, సిబ్బంది అందుబాటు, తగిన శిక్షణ అందించడంతో పాటు ప్రభుత్వంలోని 26 వేల బెడ్స్ కి ఆక్సిజన్ అందుబాటులో ఉంచామన్నారు.. పిల్లల కోసం జిల్లా ఆస్పత్రుల్లో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని.. 100 పైగా బెడ్స్ ఉన్న అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఆగస్టు నెలాఖరు నాటికి ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ పెట్టుకోవాలని ఆదేశించారు హెల్త్ డైరెక్టర్‌ శ్రీనివాస్.

Exit mobile version