NTV Telugu Site icon

ప్ర‌జ‌లు స‌హ‌క‌రిస్తున్నారు…ఐడీ కార్డులు చూపిస్తే అనుమ‌తిస్తాం-డిజీపీ

తెలంగాణ‌లో ఈరోజు నుంచి లాక్‌డౌన్ అమ‌లుచేస్తున్న సంగ‌తి తెలిసిందే.  లాక్‌డౌన్ కు కొన్ని రంగాల‌కు మిన‌హాయింపులు ఇచ్చారు.  వ్య‌వ‌సాయ ప‌నుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు కూడా ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూస్తున్నారు.  ఫార్మా, ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ రంగాల కార్మికుల‌కు ఇబ్బంది ఉండ‌ద‌ని, ఆయా కంపెనీల ఐడీ కార్డుల‌ను చూపిస్తే అనుమ‌తి ఇస్తామ‌ని డీజీపి మ‌హెంద‌ర్ రెడ్డి పేర్కొన్నారు.  ప్ర‌జ‌లు పూర్తిస్థాయిలో స‌హ‌క‌రిస్తున్నార‌ని డిజీపీ తెలిపారు.  ప్ర‌జ‌లు అన‌వ‌స‌రంగా రోడ్లమీద‌కు వ‌చ్చి ఇబ్బందులు ప‌డోద్ద‌ని, లాక్‌డౌన్ స‌డ‌లింపు స‌మ‌యంలో ఒక‌రు లేదా ఇద్ద‌రు మాత్ర‌మే బ‌య‌ట‌కు రావాల‌ని అన్నారు.  కోవిడ్ నిబంద‌న‌లు అంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని డీజీపీ మ‌హెంద‌ర్ రెడ్డి పేర్కొన్నారు.