Site icon NTV Telugu

Cyber Fraud : సైబర్ నేరాలపై పెద్ద ఎత్తున ఆపరేషన్.. 228 మంది అరెస్ట్

Cyber Crime

Cyber Crime

Cyber Fraud : తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సైబర్ నేరాలపై తన దూకుడు కొనసాగిస్తోంది. 2025 సంవత్సరంలో ఇప్పటివరకు మొత్తం 228 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. వీరు దేశవ్యాప్తంగా 1,313 కేసుల్లో నిందితులుగా ఉన్నారని, వాటిలో 1,089 కేసులు తెలంగాణకే చెందినవని విచారణలో బయటపడింది. ఇప్పటివరకు వీరు కలిపి సుమారు ₹92 కోట్లు మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది.

Film Federation : సంచలనం.. సోమవారం నుంచి షూటింగ్స్ బంద్..?

సైబర్ నేరాల్లో పలు రకాల మోసాలకు పాల్పడిన ఈ నిందితుల్లో ప్రైవేట్ ఉద్యోగులు, విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, బ్యాంక్ ఉద్యోగులు కూడా ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఫేక్ కాల్ సెంటర్ల పేరుతో అమెరికా పౌరులను టార్గెట్ చేస్తూ మోసాలు చేసిన గుజరాత్ ముఠాలో 63 మందిని అరెస్ట్ చేశారు. అదే విధంగా సూరత్‌ను కేంద్రంగా చేసుకుని పనిచేసిన మరో ముఠాలో 20 మందిని అదుపులోకి తీసుకున్నారు.

ఇన్వెస్ట్మెంట్ మరియు జాబ్ ఫ్రాడ్ కేసులు, ఆన్లైన్ ట్రేడింగ్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ నేరాలు, ఇతర సైబర్ నేరాల్లో కూడా పలువురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అదనంగా, ఈ ఏడాది ఆన్లైన్లో లైంగిక వేధింపుల కేసుల్లో 15 మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వివరించారు.సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రజలకు హెచ్చరిక జారీ చేస్తూ, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Green fuel: భూగర్భంలో భారీగా “గ్రీన్ ఇంధన” నిల్వలు.. 1.70 లక్షల ఏళ్లకు సరిపోయే అద్భుత నిధి..

Exit mobile version