Site icon NTV Telugu

తెలంగాణ క‌రోనా అప్డేట్‌: ఈరోజు కేసులు ఎన్నంటే…

తెలంగాణ‌లో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతున్నాయి.  వ్యాక్సినేష‌న్, క‌ట్ట‌డికి స‌మ‌గ్ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటుండ‌టంతో కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.  తాజాగా రాష్ట్రంలో 657 కరోనా కేసులు న‌మోద‌వ్వ‌గా, ఇద్ద‌రు మృతిచెందారు.  రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 6,43,093 కేసులు న‌మోద‌య్యాయి.  ఇందులో 6,29,986 మంది కోలుకొని డిశ్చార్జ్ అవ్వ‌గా, 9,314 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  ఇక, క‌రోనాతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 3,793 మంది మృతి చెందిన‌ట్టు ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో పేర్కొన్న‌ది.  గ‌డిచిన 24 గంట‌ల్లో తెలంగాణ‌లో క‌రోనా నుంచి 578 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  క‌రోనా కేసులు చాలా వ‌ర‌కు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ప్ర‌జ‌లు సాధార‌ణ జీవ‌నానికి అల‌వాటు ప‌డుతున్నారు.  అన్ని రంగాలు ఒక్కొక్క‌టిగా తెరుచుకుంటున్నాయి.  కేసులు త‌గ్గుముఖం ప‌ట్టినా పూర్తిగా తీవ్ర‌త త‌గ్గిపోలేద‌ని, త‌ప్ప‌ని స‌రిగా క‌రోనా నిబంధ‌న‌లు పాటించాల‌ని ఆరోగ్య‌శాఖ ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింది.  

Read: కృతీ సనన్ కు తప్పని ‘ఎర్లీ డెలివరీ’! అనూహ్యంగా ‘ఆన్ లైన్ పురిటి నొప్పులు’!

Exit mobile version