తెలంగాణలో క్రమంగా కరోనా కేసులు తగ్గుతున్నాయి.. ఓవైపు టెస్టుల సంఖ్య పెంచినా.. పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం భారీగా తగ్గుతూ వస్తోంది… తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,33,134 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… 1,897 మందికి పాజిటివ్ గా తేలింది.. మరో 15 మంది కరోనాబారినపడి మృతిచెందారు.. ఇదే సమయంలో 2,982 మంది పూర్తి స్థాయిలో కోలుకున్నారని ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.. దీంతో.. ఇప్పటి వరకు కోవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 3,409కు చేరుకోగా.. ప్రస్తుతం 24,306 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. పాజిటివ్ కేసుల సంఖ్య 5,95,000కు చేరగా.. రికవరీ కేసులు 5,67,285కు పెరిగాయి..
తెలంగాణలో తగ్గిన కోవిడ్ కేసులు
COVID 19