తెలంగాణలో కరోనా రోజువారి కరోనా కేసులు రెండు వేల దిగవకు చేరుకున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంట్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1,933 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 16 మంది కరోనా పొట్టనబెట్టుకుంది.. ఇదే సమయంలో .. గడిచిన 24 గంటల్లో 3,527 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25,406 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇక, కరోనా కట్టడి కోసం ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ ఈ నెల 9వ తేదీతో ముగియనుండగా.. రేపు సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం కానున్న రాష్ట్ర కేబినెట్.. కరోనా తాజా పరిస్థితి, వ్యాక్సినేషన్ తదితరల అంశాలతో పాటు.. లాక్‌డౌన్ పొడిగించాలా..? లేదా అనే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ లాక్‌డౌన్ పొడిగించినా.. మరికొన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ కరోనా అప్‌డేట్..
Covid 19