Site icon NTV Telugu

COVID 19 Update: బుసలు కొడుతోన్న కరోనా.. తెలంగాణలో 500కు చేరువగా కేసులు

Covid 19

Covid 19

తెలంగాణలో మరోసారి కరోనా విజృంభిస్తోంది.. వరుసగా కేసులు పెరిగిపోతున్నాయి.. రెండు రోజుల క్రితం.. నాలుగు నెలల తర్వాత అత్యధికంగా వెలుగుచూసిన కేసులు 400కు పైగా నమోదు కాగా.. ఇవాళ ఆ సంఖ్య మరింత పెరిగి ఐదు వందలకు చేరువైంది.. నాలుగు మాసాల తర్వాత ఐదు వందలకు చేరువలో కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 28,865 శాంపిల్స్‌ పరీక్షింగా కొత్తగా 494 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 126 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ప్రస్తుతం 3,048 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తన బులిటెన్‌లో పేర్కొంది.. కొత్త కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 315 కేసులు వెలుగు చూడడం కలకలం రేపుతోంది..

Read Also: KTR: ఢిల్లీలో కేటీఆర్‌ బిజీబిజీ.. కేంద్రమంత్రి హ‌రిదీప్ సింగ్‌ పూరీతో భేటీ

ఇక, వరుసగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తం అయ్యింది.. గతవారంతో పోలిస్తే కేసుల సంఖ్య రెట్టింపు కావడంతో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని వైద్యశాఖ హెచ్చరించింది.. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేస్తున్నారు. కాగా, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంతో.. ఫోర్త్‌ వేవ్‌ ప్రారంభం అయ్యిందనే అంచనాలు కూడా ఉన్నాయి.

Exit mobile version