NTV Telugu Site icon

తెలంగాణ కోవిడ్‌ అప్‌డేట్..

COVID

తెలంగాణలో క్రమంగా కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.. నిన్నటితో పోలిస్తే.. ఇవాళ మరికొన్ని కేసులు తక్కువగా నమోదయ్యాయి.. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1175 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఇదే సమయంలో మరో 10 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 1,771 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,15,574కు పెరగగా.. రికవరీ కేసులు 5,95,348కు చేరాయి.. మృతుల సంఖ్య 3,586కు చేరినట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.. ప్రస్తుతం రాష్ట్రంలో 16,640 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.. గత 24 గంటల్లో 1,24,907 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. మరో 820 టెస్ట్‌లకు సంబంధించిన రిపోర్ట్‌లు రావాల్సి ఉందని బులెటిన్‌లో పేర్కొన్నారు.