NTV Telugu Site icon

తెలంగాణ క‌రోనా అప్‌డేట్‌.. మ‌ళ్లీ పెరిగిన పాజిటివ్ కేసులు

తెలంగాణ‌లో క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్న క‌రోనా పాజిటివ్ కేసులు.. ఇవాళ స్వ‌ల్పంగా పెరిగాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా బులెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,20,043 మందికి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 1,556 మందికి పాజిటివ్‌గా తేలింది.. మ‌రో 14 మంది క‌రోనా బాధితులు మృతిచెంద‌గా.. 24 గంట‌ల్లో 2070 మంది క‌రోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,06,436కు పెర‌గ‌గా.. రిక‌వ‌రీ కేసుల సంఖ్య 5,82,993కు చేరింది.. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు మృతిచెందిన‌వారి సంఖ్య 3,510కు పెరిగింది.. దేశ‌వ్యాప్తంగా క‌రోనా రిక‌వ‌రీ రేటు 95.60 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 96.13 శాతంగా ఉంద‌ని.. ప్ర‌స్తుతం రాష్ట్రవ్యాప్తంగా 19,933 యాక్టివ్ కేసులు ఉన్నాయ‌ని బులెటిన్‌లో పేర్కొంది స‌ర్కార్.