NTV Telugu Site icon

తెలంగాణ కరోనా అప్‌డేట్‌..

covid

తెలంగాణ‌లో క్రమంగా కోవిడ్‌ కేసులు తగ్గుతూ వస్తున్నాయి.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంట‌ల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,30,430 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,798 మందికి పాజిటివ్‌గా తేలింది. కోవిడ్‌ బారినపడి మరో 14 మంది మృతి చెందారు. ఇక, 24 గంటల్లో 2,524 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ప్రస్తుతం 23,561 యాక్టివ్‌ కేసులు ఉండగా.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,98,611కు చేరింది, రికవరీ కేసులు 5,71,610కి పెరిగింది.. ఇక, ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 3,440కి చేరింది. రికవరీ రేటు భారత్‌లో 94.71 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 95.48 శాతంగా ఉంది. ఇక, తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 174, ఖమ్మం 165, నల్గొండ 151, సంగారెడ్డి 107 కొత్త కేసులు నమోదు అయ్యాయి.