Site icon NTV Telugu

తెలంగాణ కోవిడ్‌ అప్‌డేట్‌.. 2,447 కొత్త కేసులు

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పైకి కదులుతూనే ఉన్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,447 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. మరో ముగ్గురు కోవిడ్‌ బాధితులు కన్నుమూశారు.. ఇదే సమయంలో 2,295 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,11,656కు చేరుకోగా.. రికవరీ కేసులు 6,85,399కు పెరిగాయి.. ఇక, ఇప్పటి వరకు కోవిడ్‌ బారినపడి 4,060 మంది మృతిచెందారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 22,197 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.. గత 24 గంటల్లో 80,138 శాంపిల్స్‌ పరీక్షించినట్టు బులెటిన్‌లో పేర్కొంది తెలంగాణ సర్కార్.

Read Also: మందుబాబులకు గుడ్ న్యూస్.. ఏపీలో మద్యం షాపుల పనివేళలు పొడిగింపు

Exit mobile version