తెలంగాణలో గత రెండు రోజులుగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి.. మొన్నటి వరకు మూడు వందల లోపు నమోదైన కేసులు.. నిన్నటి నుంచి మళ్లీ పెరుగుతున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 417 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు కోవిడ్ బాధితులు ప్రాణాలు విడిచారు.. ఇదే సమయంలో 569 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. దీంతో.. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,53,202కు పెరగగా.. నేటి వరకు 6,42,413 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. ఇప్పటివరకు 3847 మంది కోవిడ్ బాధితులు మృతి చెందగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 6,939 యాక్టివ్ కేసులు ఉన్నట్టు ప్రభుత్వం పేర్కొంది.
తెలంగాణ కరోనా అప్‌డేట్.. మరింత పైకి కొత్త కేసులు..

COVID 19