తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరిగాయి.. గత బులెటిన్‌లో 300కు దిగువగా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇవాళ మళ్లీ నాలుగు వందలకు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 405 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో ముగ్గురు కరోనా బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 577 మంది కోవిడ్ బాధితులు పూర్థిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 6,52,785కి చేరుకోగా.. రికవరీ కేసుల సంఖ్య 6,41,874కు పెరిగాయి.. ఇక, ఇప్పటి వరకు కరోనా బారినపడి మృతిచెందినవారి సంఖ్య 3,845కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రం వ్యాప్తంగా 7,093 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. గత 24 గంటల్లో 84,262 శాంపిల్స్‌ను పరీక్షించినట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.
తెలంగాణ కరోనా అప్‌డేట్.. మళ్లీ భారీగా పాజిటివ్ కేసులు
Covid 19