NTV Telugu Site icon

తెలంగాణ క‌రోనా అప్డేట్‌: ఈరోజు కేసులు ఎన్నంటే…

తెలంగాణ‌లో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతున్నాయి.  రోజువారీ కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో అన్ని రంగాలు తిరిగి ప్రారంభం అయ్యాయి.  సినిమా థియోట‌ర్ల‌తో స‌హా అన్ని ప్రారంభ‌మ‌య్యాయి.  ఇక ఇదిలా ఉంటే, తాజాగా తెలంగాణ ఆరోగ్య‌శాఖ క‌రోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది.  ఈ బులిటెన్ ప్ర‌కారం రాష్ట్రంలో కొత్త‌గా 455 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 6,45,406 కి చేరింది.  ఇందులో 6,32,728 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 8,873 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  ఇక, క‌రోనాతో కొత్త‌గా ముగ్గురు మృతి చెందారు.  దీంతో రాష్ట్రంలో క‌రోనాతో మృతిచెందిన వారి సంఖ్య 3,805కి చేరింది.  తెలంగాణ‌లో గ‌డిచిన 24 గంట‌ల్లో 648 మంది క‌రోనా నుంచి కోలుకున్న‌ట్టు ఆరోగ్య‌శాఖ తెలియ‌జేసింది.  

Read: ఆ గుహ మొత్తం ఎముక‌లే…ప‌రిశోధించ‌డానికి వెళ్తే…