
తెలంగాణలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. రాత్రి 8 గంటల వరకు మొత్తం 72,364 కరోనా టెస్టులు నిర్వహించగా 2157 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,34,738కి చేరింది. ఇందులో 3,07,499 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 25,459 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఎనిమిది మంది కరోనాతో మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మృతుల సంఖ్య 1780కి చేరింది.