Site icon NTV Telugu

Corona Updates : తెలంగాణలో వెయ్యిదాటిన కరోనా కేసులు.. ఫోర్త్‌ వేవ్‌ తప్పదా..

Corona

Corona

Telangana Corona Bulleting 02.08.2022
యావత్తు ప్రపంచ దేశాలను అతలకుతలం చేస్తున్న కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. ఫస్ట్‌, సెకండ్‌ వేవల్‌లలో కరోనా సృష్టించి కల్లోలం అంతా ఇంతా కాదు. అయితే థర్డ్‌ వేవ్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. అయితే ఇప్పుడు ఫోర్త్‌ వేవ్‌ రూపంలో మళ్లీ కరోనా మహమ్మారి ప్రజలపై విరుచుకుపడేందుకు సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. తెలంగాణలో సైతం కరోనా విజృంభణ కొనసాగుతోంది. అయితే తాజాగా.. తెలంగాణలో ఒక్కరోజు వ్యవధిలో కొత్త కేసుల సంఖ్య 1000కి పైన నమోదవం ఆందోళన కలిగించే విషయం. గడిచిన 24 గంటల్లో 44,202 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,054 మందికి పాజిటివ్ గా నిర్ధారణైంది.

 

అత్యధికంగా హైదరాబాదులో 396 కొత్త కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 60, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 60, నల్గొండ జిల్లాలో 49, కరీంనగర్ జిల్లాలో 46 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 795 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,21,671 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 8,11,568 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,992 కొత్త కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.

 

Exit mobile version