Site icon NTV Telugu

Koppula Eshwar: కాంగ్రెస్ కు ఓట్ల మీద ప్రేమ తప్ప దళితుల మీద లేదు

Minister Koppula Eshwer

Minister Koppula Eshwer

Koppula Eshwar: కాంగ్రెస్ కు ఓట్ల మీద ప్రేమ తప్ప దళితుల మీద లేదని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ విమర్శించారు. దేశంలో 40 కోట్లకు పైగా దళితులు, గిరిజనులున్నారు. 50 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ దళితులు, గిరిజనులకు ద్రోహం చేసిందన్నారు. దళితులు, గిరిజనులు కాంగ్రెస్ మాటలు నమ్మడం అమాయకులన్నారు. దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ విడుదల చేయాల్సింది తెలంగాణలో కాకుండా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఇప్పుడు డిక్లరేషన్ పేరుతో హడావుడి చేస్తున్న పార్టీ.. ఇన్నాళ్లూ ఈ పథకాలను అమలు చేయాలనే ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో దళిత, గిరిజన విద్యార్థుల కోసం ఎన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేశారో లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ ఎస్ ప్రభుత్వం మొత్తం 1006 రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసిందని ఆయన స్పష్టం చేశారు.

Read also: September 5 Financial Changes: సెప్టెంబర్‌లో ఆర్థిక రంగంలో 5 మార్పులు..

దళితులు, గిరిజనులు ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందుతున్నారంటే రెసిడెన్షియల్ విద్య ఫలితమేనని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దళితుల బంధు పథకం ఎందుకు లేదని.. దళితుల బందులకు 12 లక్షలు కాదు, కాంగ్రెస్‌కు దమ్ముంటే తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఐదు లక్షల రూపాయలు ఇస్తామని సవాల్ విసిరారు. తెలంగాణలో ఎన్నికలు మాత్రమే ఉన్నాయని ప్రకటన పేరుతో కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు దళితులపై ప్రేమ లేదని, ఓట్లపైనే ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత, గిరిజనుల అభివృద్ధి జరుగుతుందన్నారు. బీఆర్‌ఎస్‌ పథకాలను కాపీ కొట్టి ఏదో చేస్తామంటూ కాంగ్రెస్‌ భ్రమలు కల్పిస్తోంది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తుందన్నారు. ఎనిమిదేళ్లలో దళిత కుటుంబాలన్నింటికీ దళిత బంధు వర్తింపజేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రకటన బూటకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత సమాజంలో అవినీతి పెద్ద ఎత్తున జరుగుతోందన్నది కేవలం దుష్ప్రచారం. ఎన్నికలు ఎలా వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 115 మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేయడమే ఎన్నికల సంసిద్ధతకు నిదర్శనమని మంత్రి అన్నారు.
Railway Board CEO: 105 ఏళ్ల భారతీయ రైల్వే చరిత్రలో తొలి మహిళా చైర్మన్.. ఎవరీ జయ వర్మ సిన్హా?

Exit mobile version