కేసీఆర్‌పై కోమటిరెడ్డి ఫైర్.. 3 నియోజకవర్గాలకే సీఎంలా వ్యవహారం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి… గందమల్ల రిజర్వాయర్ ఎత్తేస్తె ఆలేరు ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉందని… కానీ, ఎమ్మెల్యే గొంగిడి సునీత చోద్యం చూస్తున్నారని ఫైర్ అయిన ఆయన.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల మోసం చేయడం మానుకోవాలని హితవుపలికారు.. కేసీఆర్ ఇన్నిసార్లు యాదాద్రికి వచ్చినా.. ఒక్కసారి యాదగిరిగుట్ట, ఆలేరు మున్సిపాలిటీ పరిస్థితి పట్టించుకోవడం లేదన్న ఆయన.. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట మున్సిపాలిటీ ప్రజలు మాత్రమే పన్నులు కడుతున్నారా…? ఇక్కడ ప్రజలు పన్నులు కట్టడం లేదా..? అంటూ కేసీఆర్‌ను మండిపడ్డారు.. ఇక, మూడు నియోజకవర్గలకే ముఖ్యమంత్రిలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించిన కోమటిరెడ్డి… రాష్ట్ర ప్రజలందరినీ సమానంగా చూడాలని సూచించారు.. రైతు వేదికలు, స్మశానవాటికలు ప్రారంభించడానికి మమ్మల్ని పిలుస్తున్నారు.. గ్రామానికి 400 ఇళ్లు కట్టి పిలిస్తే దానికి ఒక అర్థం ఉంటుందన్నారు.. మరోవైపు.. డిగ్రీలు చదివిన విద్యార్థులు ఉపాధి హామీ కూలికి పోవాలంటా అది ఉద్యోగం అంట పనిమాలిన వాళ్లను మంత్రులుగా పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు పోయే కాలం దగ్గరకు వచ్చిందన్న కోమటిరెడ్డి.. సీఎం కేసీఆర్ మెడలు వంచైనా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయిస్తామని ప్రకటించారు.
Also Read
- Kalyana Lakshmi: కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ కోసం అడ్డదారులు.. గుట్టురట్టు చేసిన పోలీసులు..
- Heavy Rain Alert: కాసేపట్లో హైదరాబాద్‌లో కుండపోత.. అత్యవసరమైతేనే బయటకు రండి.!
- CM Revanth Reddy : ఏపీలో రూ.10 వేల కోట్ల బకాయిలు.. అక్కడ ఎందుకు ప్రశ్నించరు.?
- CM Revanth Reddy: రైతుల కోసం ఉపాధి హామీలో 10 కొత్త పనులు.. కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి..
తాజావార్తలు
-
8000mAh బ్యాటరీ, 7-అంగుళాల OLED డిస్ప్లే, 50MP కెమెరా.. Redmi నుంచి కొత్త ఫోన్ విడుదల తేదీ ఖరారు..
-
Priyanka Gandhi: ‘‘ అత్యాచార నిందితులకు మద్దతు’’.. ప్రహ్లాద్ జోషిపై ప్రియాంకాగాంధీ సంచలన వ్యాఖ్యలు..
-
Kalyana Lakshmi: కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ కోసం అడ్డదారులు.. గుట్టురట్టు చేసిన పోలీసులు..
-
Rahul Gandhi: ‘అత్యంత నీచమైన వ్యక్తి’.. కొత్త విద్యాశాఖ మంత్రిపై రాహుల్ గాంధీ ఫైర్
-
Kitchen Cleaning Hacks: మిక్సర్ బేస్ శుభ్రం చేసే బెస్ట్ ట్రిక్స్.. మురికి, దుర్వాసనకు గుడ్‌బై
ట్రెండింగ్
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!