Site icon NTV Telugu

కేసీఆర్‌పై కోమటిరెడ్డి ఫైర్‌.. 3 నియోజకవర్గాలకే సీఎంలా వ్యవహారం..!

Komatireddy

Komatireddy

మరోసారి సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి… గందమల్ల రిజర్వాయర్ ఎత్తేస్తె ఆలేరు ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉందని… కానీ, ఎమ్మెల్యే గొంగిడి సునీత చోద్యం చూస్తున్నారని ఫైర్‌ అయిన ఆయన.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల మోసం చేయడం మానుకోవాలని హితవుపలికారు.. కేసీఆర్ ఇన్నిసార్లు యాదాద్రికి వచ్చినా.. ఒక్కసారి యాదగిరిగుట్ట, ఆలేరు మున్సిపాలిటీ పరిస్థితి పట్టించుకోవడం లేదన్న ఆయన.. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట మున్సిపాలిటీ ప్రజలు మాత్రమే పన్నులు కడుతున్నారా…? ఇక్కడ ప్రజలు పన్నులు కట్టడం లేదా..? అంటూ కేసీఆర్‌ను మండిపడ్డారు.. ఇక, మూడు నియోజకవర్గలకే ముఖ్యమంత్రిలా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని విమర్శించిన కోమటిరెడ్డి… రాష్ట్ర ప్రజలందరినీ సమానంగా చూడాలని సూచించారు.. రైతు వేదికలు, స్మశానవాటికలు ప్రారంభించడానికి మమ్మల్ని పిలుస్తున్నారు.. గ్రామానికి 400 ఇళ్లు కట్టి పిలిస్తే దానికి ఒక అర్థం ఉంటుందన్నారు.. మరోవైపు.. డిగ్రీలు చదివిన విద్యార్థులు ఉపాధి హామీ కూలికి పోవాలంటా అది ఉద్యోగం అంట పనిమాలిన వాళ్లను మంత్రులుగా పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు పోయే కాలం దగ్గరకు వచ్చిందన్న కోమటిరెడ్డి.. సీఎం కేసీఆర్‌ మెడలు వంచైనా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయిస్తామని ప్రకటించారు.

Exit mobile version