NTV Telugu Site icon

CM Revanth Reddy: నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి..

Cmrevanthreddy

Cmrevanthreddy

CM Revanth Reddy: నేడు మరోసారి ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఢిల్లీలో ముందుగా హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. అనంతరం వరద నష్టం వివరాలను తెలుపనున్నారు. ఇక కేంద్రం ప్రకటించిన అతి తక్కువ వరద సహాయంపై మరోసారి పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తుంది. కాగా.. సెప్టెంబర్ మొదటి వారంలో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు.. వరదలు తీరని నష్టాలను మిగిల్చాయి. దీనికి వరద నష్టాన్ని అంచనావేయడానికి రాష్ట్రంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రితోపాటు.. కేంద్ర ప్రత్యేక బృందం పర్యటించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో వరద నష్టం రూ.10 వేల కోట్లకు పైగా లెక్క తేలగా కేవలం రూ.421 కోట్లు మాత్రమే కేంద్రం నిధులు విడుదల చేసింది. దీంతో రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 6న ఢిల్లీకి వెళ్ళి మరోసారి వివిధ శాఖల కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వలన కలిగిన నష్టాలను వివరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Read also: Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి

అలాగే, తన పర్యటనలో కేంద్ర హోం శాఖ నిర్వహించే రాష్ట్ర హోం మంత్రుల సమావేశంలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి తెలంగాణ హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హోం మంత్రిత్వ శాఖ ఆయన వెంట ఉంది. మంత్రివర్గ విస్తరణ జరిగితే సీనియర్ నేతకు హోం శాఖ కేటాయించే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో ఆయన పలుమార్లు ఢిల్లీ వెళ్లి మంత్రివర్గ విస్తరణపై చర్చించారు. ఢిల్లీ పర్యటనలో ఆయన కాంగ్రెస్ సీనియర్ నేతలతో సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రి పదవి విషయంలో రేవంత్ రెడ్డి ఇప్పటికే కొందరి పేర్లను హైకమాండ్‌కు సమర్పించారు. అయితే అభ్యర్థులు చాలా బిజీగా ఉండడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.
Iran Israel War: ఫ్రెంచ్ కంపెనీపై ఇజ్రాయెల్ సైన్యం బాంబు దాడి

Show comments