Revanth Reddy: కీరవాణి వ్యవహారంతో నాకు సంబంధం లేదు..రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana CM Revanth Reddy Responds on Keeravani Issue: తెలంగాణ రాష్ట్ర గీతంగా ఎంపిక చేసిన జయ జయహే తెలంగాణ అనే గీతాన్ని ప్రభుత్వం అధికారికంగా రికార్డు చేయిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే కీరవాణి మూలాలు ఆంధ్ర ప్రాంతానికి చెందినవి కావడంతో ఈ విషయం మీద ట్రోలింగ్ జరుగుతోంది. తెలంగాణ ఆత్మగౌరవంగా భావించే రాష్ట్ర గీతానికి ఒక ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి ఎలా మ్యూజిక్ ఇస్తారు అనే విషయం మీద సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన వారు మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. అయితే ఇప్పటికే రికార్డింగ్ సెషన్స్ కూడా మొదలైనట్లుగా ప్రచారం జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయం మీద స్పందించారు. తెలంగాణ అంటేనే రాచరికానికి వ్యతిరేకం, రాచరిక ఆనవాళ్లకు ఇక్కడ చోటు లేదు అని అన్నారు.
Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’లో దీపికా పాత్ర అలా ఉండబోతుందా..?
Also Read
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
- Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
- CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
తెలంగాణ అంటే త్యాగాలు, పోరాటాలు గుర్తొస్తాయి, ఆ త్యాగాలు, పోరాటాలు గుర్తొచ్చేలా చిహ్నం, గేయం రూపొందిస్తున్నాం అని అన్నారు. రాజముద్ర రూపకల్పన బాధ్యత ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్‌కు ఇచ్చామని, తెలంగాణ గేయానికి సంగీతం సమకూర్చడం సహా మొత్తం వ్యవహారాన్ని అందె శ్రీకే అప్పగించాం అని అన్నారు. కీరవాణి వ్యవహారంతో నాకు సంబంధం లేదు, ఎవరితో సంగీతం చేయించుకోవాలనేది అందెశ్రీ దే తుది నిర్ణయం అని రేవంత్ రెడ్డి అన్నారు. ఇక అందెశ్రీ ఫోన్ కాల్ గా చెబుతున్న ఒక ఆడియో రికార్డ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో అందెశ్రీ కీరవానికి అవకాశం ఇచ్చిన వ్యవహారం మీద ఆయనను ఒక యువకుడు ప్రశ్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఆ యువకుడికి తనదైన శైలిలో అందెశ్రీ సమాధానం కూడా ఇస్తున్నారు. మరి ఈ అంశం మీద అందెశ్రీ స్పందిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.
తాజావార్తలు
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. ఇండియా తుది జట్టు ఇదే..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..