CM Revanth Reddy : హైదరాబాద్‌లో జరిగిన బయోడిజైన్ ఇన్నోవేషన్ సమ్మిట్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య ప్రసంగం చేశారు. జీవవిజ్ఞానం, వైద్య రంగం, ఆవిష్కరణల ప్రాధాన్యం గురించి ఆయన విశ్లేషిస్తూ తెలంగాణను ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. “దేవుడు ఒక మంచి డిజైనర్, ప్రకృతి మంచి గురువు. మనం మంచి విద్యార్థులమా కాదా అనేది ప్రశ్న,” అని సీఎం రేవంత్ అన్నారు. జీవశాస్త్రం, వైద్య రంగంలో ప్రకృతినే మనకు ఉత్తమ గురువుగా తీసుకోవాలని, మనం చేసే పరిశోధనల్లో తప్పులు చేయకుండా ముందుకు సాగాలని సూచించారు. కృత్రిమ మేధస్సు (AI) కూడా బయోడిజైన్‌కు మంచి ఉదాహరణ అని, సహజ మెదడును ఆధారంగా తీసుకుని మానవులు కృత్రిమ మెదడును సృష్టించారని తెలిపారు.
CM Chandrababu: ఎరువులు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కేసులు.. ధరలు పెంచి అమ్మిన వారిపై కఠిన చర్యలు
“మేము తెలంగాణ రైజింగ్ 2047 అనే ప్రయాణాన్ని ప్రారంభించాం. 2034 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ ఇప్పటికే ఫార్మా, బయోటెక్, లైఫ్ సైన్సెస్, మెడ్‌టెక్ రంగాల్లో దేశంలో ముందంజలో ఉందని సీఎం తెలిపారు. సుల్తాన్‌పూర్‌లో 302 ఎకరాల్లో ఏర్పాటు చేసిన దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైసెస్ పార్క్‌లో 60కి పైగా దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు పనిచేస్తున్నాయని చెప్పారు. డయాగ్నస్టిక్ పరికరాలు, ఇమేజింగ్ టెక్నాలజీలు, ఇంప్లాంట్లు, శస్త్రచికిత్స పరికరాలు, డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్‌లో పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు.
స్థానిక స్టార్టప్‌లు, MSMEలు కూడా గ్లోబల్ కంపెనీలతో కలసి పనిచేస్తున్నాయని, ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తుందని సీఎం రేవంత్ భరోసా ఇచ్చారు. అవసరమైన సహకారాన్ని అందిస్తామని, డేటా గోప్యతను కాపాడుతూ ప్రజల ఆరోగ్య సేవలకు కావాల్సిన సమాచారం అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పన్నులు, యుద్ధాలు, వాణిజ్య పరమైన అడ్డంకులు కనిపిస్తున్నప్పటికీ, ఆవిష్కరణలకు తెలంగాణే సరైన వేదిక అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. “మనందరం కలసి పనిచేసి మానవాళిని మరింత ఆరోగ్యంగా మార్చడానికి కృషి చేద్దాం” అని ఆయన పిలుపునిచ్చారు.
ISRO Gaganyaan mission: ఇస్రో సూపర్ సక్సెస్.. ఎయిర్ డ్రాప్ టెస్ట్ విజయవంతం
