NTV Telugu Site icon

యాదాద్రికి సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ యాదాద్రి పునఃనిర్మాణాన్ని ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న విష‌యం తెలిసిందే.. ఇప్ప‌టికే ఎన్నో సంద‌ర్భాల్లో యాదాద్రి ప‌ర్య‌టించిన ఆయ‌న‌.. ప‌లు కీల‌క మార్పులు, చేర్పులు సూచిస్తూ వ‌చ్చారు. అయితే, రేపు మ‌రోసారి యాద‌గిరి గుట్ట ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. ముగింపు ద‌శ‌లో ఉన్న యాదాద్రి నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించ‌నున్న సీఎం.. ఆల‌య పునఃసంప్రోక్ష‌ణ కోసం నిర్వ‌హించ‌నున్న సుద‌ర్శ‌న‌యాగం, ఇత‌ర ఏర్పాట్ల‌పై సంబంధిత అధికారుల‌తో చ‌ర్చించ‌నున్నారు.. కాగా, మార్చి 22 నుంచి మార్చి 28 వ తేదీ వ‌ర‌కు వారం రోజుల‌పాటు యాదాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి ఆల‌య పునఃప్రారంభోత్స‌వాలు నిర్వ‌హించేందుకు ముహూర్తాన్ని నిర్ణ‌యించారు.. ఆ దిశ‌గా చురుకుగా ఏర్పాటు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే..