NTV Telugu Site icon

CM KCR Delhi Visit: ఢిల్లీలో కేసీఆర్.. రేపు రాష్ట్రపతితో భేటీ.. అమిత్‌షాతో సమావేశం..

Cm Kcr

Cm Kcr

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు హస్తినకు చేరుకున్నారు.. ఇక, రేపటి నుంచి ఆయన ఢిల్లీలో బిజీ బిజీగా గడపనున్నారు.. మొదటగా మంగళవారం రోజు కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వంగా కలిసి అభినందనలు తెలపనున్నారు.. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సహా పలువురు కేంద్ర మంత్రలతో సమావేశం కానున్నారు.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలిసి రాష్ట్రంలో వరదల వల్ల కలిగిన నష్టాన్ని వివరించనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి.. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ అధీనంలో ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ విభాగం ఉండడంతో.. ఆయన అమిత్‌షాతో ప్రత్యేకంగా సమావేశమైన తెలంగాణలో వరదలు.. వాటివల్ల కలిగిన నష్టం గురించి వివరించనున్నారు. ఇక, కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కూడా కలిసి రాష్ట్రంలో వరదలు సృష్టించిన భీభత్సం గురించి వివరించబోతున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్.. కేంద్రం విడుదల చేయాల్సిన పెండింగు నిధుల పై కూడా చర్చించనున్నారు.. ఇరువురు కేంద్ర మంత్రుల తో జరిగే భేటీల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్, పలువురు టీఆర్ఎస్‌ ఎంపీలు పాల్గొనే అవకాశం ఉంది.

Read Also: Sonia Gandhi: రేపు ఈడీ విచారణకు సోనియా గాంధీ.. నిరసనలకు కాంగ్రెస్ సిద్ధం

తెలంగాణలో ఇప్పటికే కేంద్ర బృందాలు పర్యటించారు.. వరద వల్ల ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేశాయి.. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ నష్టం కలిగిన విషయం తెలిసిందే.. ఇక, ఎప్పుడూ లేనంతగా కడియం ప్రాజెక్టుకు వరద వచ్చిన విషయం తెలిసిందే.. కాగా, రెండు మూడ్రోజుల పాటు హస్తినలోనే మకాం వేయనున్నారు కేసీఆర్.. తన పర్యటనలో విపక్షాలకు చెందిన జాతీయ నేతలను కలవనున్నారు.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇచ్చే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.. ఇప్పటికే తెలంగాణ గవర్నర్‌ తమిళిసై.. ఢిల్లీలోనే ఉన్నారు.. ఆమె కూడా పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.. ఈ నేపథ్యంలో.. కేసీఆర్‌ హస్తిన టూర్‌ ఆసక్తికరంగా మారింది.

Show comments