Site icon NTV Telugu

CM KCR Delhi Tour: కేసీఆర్‌ హస్తిన బాట.. మూడు రోజులు అక్కడే మకాం.. విషయం ఇదేనా..?

Kcr

Kcr

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు మరోసారి హస్తినబాట పట్టారు.. బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీ బయల్దేరిన ఆయన.. రెండు మూడు రోజుల పాటు అక్కడే మకాం వేయనున్నారు.. గత కొన్ని రోజుల పాటు రాష్ట్రంలోని సమస్యలు, వర్షాలు, వరదలు, సంక్షేమ పథకాలపై దృష్టిసారించిన కేసీఆర్.. మరోసారి జాతీయ రాజకీయాలపై ఫోకస్‌ పెట్టినట్టుగా తెలుస్తోంది.. అందులో భాగంగా రెండు మూడు రోజుల పాటు అక్కడే ఉండనున్న గులాబీ పార్టీ బాస్.. జాతీయ స్థాయిలో వివిధ కీలక నేతలతో భేటీ అవుతారని గులాబీ పార్టీ శ్రేణులు చెబుతున్నమాట.. ఇక, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థితో పాటు.. విపక్షాల అభ్యర్థి కూడా కూడా ఖరారయ్యారు.. అయితే, ఆమె కాంగ్రెస్‌ నేపథ్యంలో ఉన్న నేపథ్యంలో.. ఇప్పటి వరకు ఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించలేదు టీఆర్ఎస్‌ పార్టీ.. తన పర్యటనలో దీనిపై కేసీఆర్ క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది..

Read Also: Chandrababu Naidu: పోలవరం పరిహారం హామీలేమయ్యాయి జగన్‌?

ఇప్పటికే టీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పార్లమెంట్ లోపల, బయట ఆందోళనలు నిర్వహిస్తున్నారు.. ఇప్పటికే పలు అంశాలపై కేంద్రంపై యుద్ధం ప్రకటించిన కేసీఆర్.. ఇప్పుడు జాతీయ రాజకీయాలపై పలువురు సీనియర్ నేతలతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సైతం ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు.. రాష్ట్రపతి ప్రమాణస్వీకారోత్సవానికి హాజరైన తమిళిసై, పలువురు కేంద్ర మంత్రులతో కూడా భేటీ అయ్యే అవకాశముందని సమాచారం. ఈనేపథ్యంలో.. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్తుండటం చర్చనీయాంశంగా మారింది. అయితే, కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనలో.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇస్తారు..? అనే విషయంపై క్లారిటీ వస్తుందని తెలుస్తోంది.. వివిధ పార్టీలకు చెందిన జాతీయ నేతలను కలిసిన తర్వాత.. ఉపరాష్ట్రపతి అభ్యర్థి మద్దతు విషయంతో పాటు.. జాతీయ పార్టీపై కూడా క్లారిటీ ఇస్తారని ప్రచారం సాగుతోంది.

Exit mobile version