డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యమంటూ కేంద్రం అధికారంలో ఉన్న బీజేపీ తరచూ చెబుతున్నమాట.. అంటే, కేంద్రంతో పాటు రాష్ట్రాల్లోనూ అదే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి వేగంగా సాగుతుందని వారి ఉద్దేశం.. తాజాగా వెలువడని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ సర్కార్ ఏర్పాటు కాబోతోంది.. దీంతో.. మరోసారి డబుల్ ఇంజన్ సర్కార్.. డబుల్ ఇంజన్ అభివృద్ధిపై బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు.. తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతోందని వ్యాఖ్యానిస్తున్నారు.. అయితే, వారికి కౌంటర్ ఇచ్చారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. అసెంబ్లీలో వివిధ అంశాలపై మాట్లాడిన ఆయన.. డబుల్ ఇంజన్ సర్కార్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: KCR: 111 జీవో ఎత్తివేస్తాం..
డబుల్ ఇంజన్ కాదు.. అది ట్రబుల్ ఇంజన్ అంటూ ఎద్దేవా చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్.. ఈ సందర్భంగా పలు గణాంకాలను అసెంబ్లీలో ప్రస్తావించారు కేటీఆర్… ఉత్తరప్రదేశ్‌లో డబుల్ ఇంజన్ ప్రభుత్వ పాలనలో ఆర్థిక వృద్ధి దేశంలో చివరి స్థానంలో ఉందని గుర్తుచేసిన ఆయన.. సింగల్ ఇంజన్ ప్రభుత్వం ఉన్న తెలంగాణ మొదటి వరుసలో ఉందని పేర్కొన్నారు… డబుల్ ఇంజన్ స్టాటజీ తెలంగాణలో పనిచేయవు అని అసెంబ్లీ వేదిగా స్పష్టం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్.
