Site icon NTV Telugu

రుణ మాఫీ పై కేబినెట్ లో కీలక నిర్ణయం…

cm kcr

వ్యవసాయం పై ఈరోజు తెలంగాణ కేబినెట్ లో చర్చించారు. వర్షాలు, పంటలు, సాగునీటి లభ్యత, ఎరువులు, ఇతర వ్యవసాయ అంశాల పై… పత్తిసాగు పై ప్రత్యేకంగా చర్చించింది. తెలంగాణ పత్తికి ఉన్న ప్రత్యేక డిమాండ్ వల్ల సాగును ఇంకా పెంచాలని, అందుకోసం రాష్ట్ర రైతాంగాన్ని సమాయత్తపరచాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించింది.

ఇక రుణ మాఫీ పై కేబినెట్ లో చర్చిస్తూ… రాష్ట్రంలో ఇప్పటివరకు పంట రుణ మాఫీకి సంబంధించిన వివరాలను కేబినెట్ ముందుంచింది ఆర్ధిక శాఖ. కరోనా కారణంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పై భారం వల్ల, గత రెండు సంవత్సరాలుగా రూ. 25,000 (ఇరవై ఐదు వేలు) వరకు ఉన్న రుణాలను మాత్రమే మాఫీ చేశారు. ఆగస్టు 15 నుంచి నెలాఖరు వరకు 50,000 (యాభై వేలు) వరకున్న పంట రుణాల మాఫీని పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించుకుంది. తద్వారా 6 లక్షల మంది రైతులు లబ్ది పొందనున్నారు.

Exit mobile version