TG Cabinet Meeting : జూలై 2న తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం.!

  • జూలై 2న మంత్రిమండలి సమావేశం
  • సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు భేటీ
  • జూలై 1లోపు అజెండా పంపాలని ఆదేశాలు
  • అధికారులు హెడ్‌క్వార్టర్స్‌లో ఉండాలని సూచన
Tg Cabinet Meeting

Tg Cabinet Meeting

TG Cabinet Meeting : తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జూలై 2వ తేదీన మధ్యాహ్నం 3:00 గంటలకు జరగనుంది. హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని 6వ అంతస్తులో ఉన్న కేబినెట్ సమావేశ మందిరంలో ఈ 34వ మంత్రిమండలి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు జూన్ 30న అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సమావేశానికి సంబంధించిన అజెండా అంశాలను తెలుగు అనువాదంతో సహా సర్క్యులేషన్ ద్వారా ఆమోదించి, జూలై 1వ తేదీ మధ్యాహ్నం 1:00 గంటల లోపు జనరల్ అడ్మినిస్ట్రేషన్ కేబినెట్ విభాగానికి పంపాలని అన్ని శాఖల స్పెషల్ చీఫ్ సెక్రెటరీలు, ప్రిన్సిపల్ సెక్రెటరీలు, సెక్రెటరీలను ప్రభుత్వం ఆదేశించింది. ఒకవేళ ఎలాంటి అజెండా అంశాలు లేకపోయినా ‘నిల్’ రిపోర్టును సమయానికి పంపాలని స్పష్టం చేశారు. అలాగే ఈ కేబినెట్ సమావేశం జరిగే సమయంలో అధికారులందరూ తప్పనిసరిగా హెడ్‌క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండాలని సిఎస్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.