Site icon NTV Telugu

Telangana Cabinet: ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్..

Revanth Reddy

Revanth Reddy

Telangana Cabinet: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రులు సమావేశం కానున్నారు. సచివాలయంలో మధ్యాహ్నం 3.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. రానున్న బడ్జెట్ సమావేశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. బడ్జెట్ సమావేశాల తేదీల అంశం కూడా చర్చకు రానుంది. అయితే ఈసారి పూర్తి బడ్జెట్ కాకుండా… ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశంలో ఆరు హామీలపై చర్చ జరగనుంది. అంతే కాకుండా పలు కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు. రూ. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500 లక్షల గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ రెండు పథకాల అమలుకు కేబినెట్ ఆమోదముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది.

Read also: America : ఇరాక్, సిరియా పై అమెరికా ప్రతీకార దాడి.. 40మంది మృతి

ఇందిరమ్మ ఇళ్ల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అప్లికేషన్‌ల కోసం అర్హులైన అభ్యర్థులను ఎలా ఎంచుకోవాలి? ఏయే అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలనే దానిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. మరి ఈ భేటీలో రెండు హామీలకు ఆమోదం లభిస్తుందా.. లేక ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అనేది చూడాలి. టీఎస్ బదులు టీజీ నంబర్ ప్లేట్లను మార్చే అంశంపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కేబినెట్ సమావేశానికి దాదాపు 20 నుంచి 25 అంశాలతో ఎజెండా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు అన్ని శాఖల నుంచి సమాచారం అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కార్యదర్శులను ఆదేశించారు.

Read also: Kannappa: ప్రభాస్ షెడ్యూల్ ఇప్పుడే కాదు… టైమ్ ఉంది మిత్రమా

బడ్జెట్ సమావేశాలపై చర్చ…!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి రెండో వారంలో ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 8 లేదా 10వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో ఈ భేటీపై చర్చించనున్నారు. గవర్నర్ ప్రసంగం కూడా ఆమోదం పొందే అవకాశం ఉంది. ఈసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను బ్యాలెన్స్ చేసి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
Astrology: ఫిబ్రవరి 04, ఆదివారం దినఫలాలు

Exit mobile version