NTV Telugu Site icon

Telangana Cabinet: రేపు కేబినెట్ విస్తరణ.. పట్నం మహేందర్‌రెడ్డికి చోటు..!

Telangana Cabinet

Telangana Cabinet

Telangana Cabinet: తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కాగా, 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థులను గులాబీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. అయితే.. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉండగానే.. అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించి విపక్షాలకు సవాల్ విసిరారు గులాబీ బాస్. మరోవైపు.. దాదాపు సిట్టింగ్ లకు మరో అవకాశం.. ఇన్ని రోజులుగా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న ఆశావహులను బుజ్జగించేందుకు గాని.. సంతృప్తి చెందని వారు వేరే వారి వద్దకు వెళితే జరిగే నష్టాన్ని పూడ్చుకోవడానికి. పార్టీలు.. కావాల్సినంత సమయం దొరికే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా.. అదే సమయంలో నేడు మంత్రివర్గంలో మార్పులు చేయనున్నట్టు సమాచారం. పోటీ చేసేందుకు టిక్కెట్టు ఆశించి తనకు వెన్నుపోటు పొడిచిన కీలక వ్యక్తులకు అవకాశం కల్పించాలని నిర్ణయించుకున్నారు.

Read also: Telangana Rain: తెలంగాణకు వర్ష సూచన.. వచ్చే ఐదు రోజులు వర్షాలే..

అయితే మంత్రి పదవి నుంచి ఈటల రాజేందర్‌కు ఉద్వాసన పలకడంతో ఆయన స్థానం ఖాళీగా ఉంది. ఈ సమయంలో, గులాబి బాస్ ఆ స్ఠానాన్ని పూరించడానికి కొత్త స్కెచ్‌ను రూపొందించారు. అయితే.. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డికి కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2014లో తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు మహేందర్‌రెడ్డి రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి ఎన్నికై ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరిన సబితా రెడ్డికి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వడంపై మహేందర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఒకానొక దశలో పార్టీ మారతారని కూడా వార్తలు వచ్చాయి. ఇప్ప టికే టికెట్ ఇవ్వక పోవడంతో మూడు నెలలుగా ఉన్న ఆయనకు మంత్రి పదవి ఇప్పించాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. మహేందర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి.. ఇద్దరూ రంగారెడ్డి జిల్లాకు చెందినవారే కావడంతో.. ఇప్పుడు ఆమె ఒంటరిగా మిగిలిపోతారా అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు అధికారిక ప్రకటన వెలువడటంతో మహేందర్ రెడ్డికి చోటు కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వం.

Wednesday: బుధవారం రోజు తల స్నానం చేస్తున్నారా..? ఇది మీ కోసమే..